పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అంశాలు ఇవేనా..!

 

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు తిరుపతిలో బహిరంగ నిర్విహిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో ఇందిరామైదానంలో జరగనున్న ఈ సభకు ఇప్పటి నుండే ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు సభలో పవన్ కళ్యాణ్ ఏ అంశాల గురించి మాట్లాడతారబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల నేపథ్యంలో మాత్రమే పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆ తరువాత ఇప్పటివరకూ ఏదో ఒకటి రెండు సమావేశాల్లో పాల్గొనిఉంటారు. అయితే ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణే సభలో ముఖ్యపాత్ర వహిస్తున్నారు కాబట్టి అటు అభిమానులే కాదు.. రాజకీయనాయకులు కూడా అంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై మాట్లాడుతారో అని కొంతమంది కొన్ని అంశాలు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. మరి అంశాలంటో చుద్దాం..

 

ఏపీకి ప్రత్యేక హోదాపై , బీజేపీ-టీడీపీల తీరుపై, కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వానికి సూచన, పవన్ యాంటీ-ఫ్యాన్స్ కు హితబోధ, ఏపీ, తెలంగాణలోని ప్రతిపక్షాలు పవన్ పై చేస్తున్న విమర్శలు మొదలైన అంశాలను పవన్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. మరి వీటిలో పవన్ ఏ అంశాలు ప్రస్తావిస్తారో చూద్దాం.