దారణం.. అందరూ చూస్తుండగానే ఆపీస్ నుండి లాకెళ్లి అత్యాచారం...
posted on Apr 23, 2016 5:04PM

ఇప్పటివరకూ మహిళలపై అత్యాచారాలు జరిగిన ఘటనలు ఎన్నో విన్నాం. అయితే ఇప్పుడు పంజాబ్ జరిగిన ఘటన చూస్తుంటే.. సభ్య సమాజం తలదించుకోవాల్సిందే. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే ఓ యువతిని బలవంతంగా లాకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పంజాబ్ లోని ముక్త్సర్ నగరంలో ఓ దళిత యువతి ఓ కంపూట్యర్ సెంటర్లో పనిచేస్తుంది. అయితే అదే గ్రామానికి చెందిన ఓ వక్తి తను పనిచేసే ఆఫీసు నుండి బలవంతంగా లాకెళ్లి.. కారులో ఫాంహౌస్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం.. ఒకరోజు తర్వాత విడిచిపెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన మార్చి 25న చోటుచేసుకుంది. మహిళను కిడ్నాప్ చేయడం అక్కడి షాపు సీసీ టీవీలో రికార్డు అవ్వడంతో అసలు విషయం బయటపడింది.
మరోవైపు జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. దీంతో బాధితురాలు తన తండ్రితో కలిసి జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది.