సం’గ్రామం’

 

panchayat elections, Panchayat Elections 2013, Panchayat Elections congress

 

 

పంచాయితీ ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జిల్లాల వారీగా కలెక్టర్లు ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొత్తం మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి.

 

అయితే ఇప్పటికే కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కాగా.. మిగతా చోట్ల ఎన్నికలకు రంగం సిద్దం అవుతుంది. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి మొదలుకానుంది. కలెక్టర్లు..  జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీచేస్తారు. ఈ నెల 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 17 న ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. కాగా.. ఈ నెల  23, 27, 31న మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.



నేటి నుంచి ఎన్నిక లకోడ్ అమలల్లో ఉండటంతో ఇక తెర వెనుక రాజకీయాలకు తెరలేవనుంది.. ఇప్పటికే చాలా చోట్ల బేరసారాలు మొదలవగా.. ఈ సారి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా అస్థవ్యస్తంగా సాగింది.. చాలా చోట్ల రిజర్వేషన్‌ కేటాయించిన సామాజిక వర్గం నేతలు లేకపోవటం అభ్యుర్థల ఎంపిక కూడా కష్టమయింది.. కొన్ని చోట్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో అడుక్కునేవారిని కూడా అభ్యర్ధులుగా ప్రకటిస్తున్నారు.. ఏది ఏమైనా సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎలక్షన్స్‌ను అన్నిపార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు..