పనామా పేపర్స్ బయటపెట్టిన మరో బాలీవుడ్ జంట..

Publish Date:May 4, 2016

 

ప్రపంచ వ్యాప్తంగా నల్ల కుబేరుల గుండెల్లో గుబులు రేపిన పనామా పేపర్స్.. ఇప్పటికే ఎంతో మంది దిగ్గజాల పేర్లను బయటపెట్టింది. వీరిలో బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, ఇంకా సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ల జంట పేర్లు ఉండగా..ఇప్పుడు తాజాగా మరో జంట పేర్లు కూడా బయటపెట్టాయి.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కాజోల్ పేర్లను పనామా పేపర్స్ బయటపెట్టింది.

 

ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ బ్రిటన్‌లోని వర్జిన్ ఐలాండ్ కు చెందిన మేరిలిబోన్ ఎంటర్ టైన్మెంట్ అనే సంస్థలో దాదాపు వెయ్యి షేర్లు కొనుగోలు చేశారని.. ఈ కంపెనీలో ఆయన భార్య కాజోల్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ కంపెనీకి అజయ్ 2013లో డైరెక్టర్ గా ఉండి.. 2014లో రాజీనామా చేశారని పనామా బయటపెట్టింది.

 

అయితే అందరూ చెప్పినట్టే ఇప్పుడు వీరు కూడా తాము ఏం తప్పు చేయలేదని అంటున్నారు. తాను ఆర్బీఐ మార్గదర్శకాలు పాటించే విదేశాల్లోని ఆ కంపెనీలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టానని.. చట్ట ప్రకారం చేయాల్సిన ట్యాక్స్ రిటర్న్స్ కూడా చేశామని, వాటి వివరాలు తన కుటుంబం ఇప్పటికే తెలియజేసిందని అజయ్ దేవగన్ అన్నారు. మరి ముందు ముందు ఇంకెంతమంది పేర్లు బయటపెడుతుందో చూడాలి.  

By
en-us Politics News -