కేంద్రంతో పెట్టుకోవద్దు.. మంత్రులకు పళని జాగ్రత్తలు...!
posted on May 3, 2017 11:56AM

కేంద్ర ప్రభుత్వం కెపాసిటీ గురించి అందరికీ ఎంతబాగ అర్ధమయ్యిందో తెలియదు కానీ.. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పళనిస్వామికి మాత్రం బాగా అర్ధమయినట్టుంది. అందుకే తమ మంత్రులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారంట. ఇంతకీ ఆ ఆదేశాలు ఏంటనుకుంటున్నారా..? పళనిస్వామి ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్ జరుగగా.. ఆయన కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు కూడా ఏమీ మాట్లాడరాదంటూ మంత్రులకు జాగ్రత్తలు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. కేంద్రంతో కయ్యం ఎంత మాత్రం మంచిది కాదని..కేంద్రం అండలేకపోతే... ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి కూడా రాదని.. కేంద్ర ప్రభుత్వంతో స్నేహంగా మెలుగుతూ, పనులు చక్కబెట్టుకుందామని చెప్పారంట. మొత్తానికి కేంద్రతో పెట్టుకుంటే తమ పనులు అవ్వవని పళనికి తొందరగానే అర్ధమయినట్టుంది.