మరో పాక్ ఉగ్రవాది పట్టివేత


 

గత కొద్దిరోజుల క్రితం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ ప్రాంతంలో మహ్మద్ నవేద్ అనే ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కాన్వాయ్ పైన దాడి చేయగా జవాన్లు ఎదురు దాడికి దిగి కాల్పులు జరపగా మహ్మద్ నవేద్ పట్టుబడ్డాడు. ఇప్పుడు భారత సైన్యం చేతికి మరో ఉగ్రవాది దొరికాడు. నలుగురు పాక్ ఉగ్రవాదులు ఉత్తర కాశ్మీర్లో చొరబడగా ఉగ్రవాదులకి.. జవాన్ల మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా షాజద్ అహ్మద్ అనే ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఇతడు పాకిస్తాన్ లోని బాలోచిస్తాన్ కు చెందిన ముజఫడ్ కు చెందినవాడిగా పోలీసు అధికారులు గుర్తించారు. ఇతనికి ఇంతకుముందు భారత్ లో చొరబడిన ఉగ్రవాదులకు సంబంధం ఉన్నట్టు అధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం షాజద్ అహ్మద్ ను మిలటరీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.