పురాతన సిల్వర్ కాయిన్స్ లభ్యం

 

మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలంలోని నీలిపల్లి గ్రామంలో ఒక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతూ వుండగా వెయ్యి పురాతన వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఈ వెండి నాణేలు 1840 సంవత్సరానికి చెందినవి. వీటి మీద విక్టోరియా మహారాణి ముఖచిత్రం ముద్రించి వుంది. వీటి విలువ దాదాపు ఐదు లక్షల రూపాయల వరకూ వుంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే పురాతన నాణేల మార్కెట్లో ఈ వెండి నాణేల విలువ మరింత ఎక్కువగా వుండొచ్చని భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu