తేల్చుడు కాదు నాన్చుడే..!!

 

తెలంగాణ విషయంపై మరోసారి కాంగ్రెస్‌ తన నిస్సహాయతను తెలిపింది.. శుక్రవారం ఉదయం నుంచి హైడ్రామ నడిపిన కాంగ్రెస్‌ ఇరు ప్రాంతాల ప్రజలను ఊరించి చివరకు ఎటూ తేల్చలేక మరోసారి వాయిదా వేసింది.

ఉదయం జరగాల్సిన కోర్కమిటీ ప్రదాని ఆరోగ్య సమస్యల కారణంగా సాయంత్రానికి వాయిదా పడటం.. ఈ లోపు తెలంగాణ,సీమాంద్ర నాయకులుతో అధిష్టానం పెద్దలు సంప్రదింపులు జరపటం.. రాష్టర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బలగాలను మోహరిచటంతో ఇక శుక్రవారం తప్పకుండా ఏదో ఒక ప్రకటన వెలువడుతుందని భావించారు అంతా.

దీనికి తోడు ఉదయం జరిగిన కోర్‌ కమిటీ భేటి తరువాత మీడియాతో మాట్లాడిన డిగ్గీ సంప్రదింపుల ప్రకియ ముగిసింది ఇక మిగిలింది పార్టీ నిర్ణయం తెలపటమే అనటంతో తప్పకుండా ప్రకటన వస్తుందని భావించారు అంతా. కనీసం సిడబ్ల్యూసి మీటింగ్‌ జరిగే తేది అయినా కరారవుతుందనుకున్నారు..

కానీ కాంగ్రెస్‌ నాయకులు ఏ నిర్ణయం తీసుకోలేక పోయారు.. ప్రకటన వెలువడుతుంది అనుకున్న తరుణంలోనే సీమాంద్ర నాయకులు తమ అస్త్రాలకు పదును పెట్టడం. కొందరూ రాజీనామాలు చేస్తామని తెగేసి చెప్పటంతో అధిష్టానం నిర్ణయం వాయిదా వేసుకుంది.. ఇన్నాళ్లుగా అనుకున్నట్టుగా తెలంగాణ తేనే తుట్టే కదిపే కాంగ్రెస్‌కు లేదని మరోసారి తేలిపోయింది.