సిస్టర్ నిర్మల కన్నుమూత

 

మదర్ థెరీసా మరణించిన తర్వాత ఆమె స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తు్న్న సిస్టర్ నిర్మల కన్నుమూశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. సిస్టర్ నిర్మల అసలు పేరు నిర్మలా జోషి. రాంచీ నగరం బీహార్‌లో వున్నప్పుడు ఆమె జన్మించారు. మదర్ థెరీసా మరణించిన తర్వాత మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తున్నారు. భారత ప్రభుత్వ ఆమెను 2009లో పద్మ విభూషణ్‌తో గౌరవించింది.