ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

ఈ మధ్య కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు ఎక్కువగా జరుగతున్న వైనం చూస్తున్నాం. తాజాగా మరోసారి ఢిల్లీలో తుపాకుల మోతతో దద్దరిల్లింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని కౌన్సిలర్ క్రిష్ణ పెహల్వాన్ కార్యాలయానికి అతి సమీపంలోనే తుపాకి కాల్పులు జరిగి ఇద్దరు హత్యకు గురయ్యారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియదని పోలీసులు తెలుపుతున్నారు. అయితే హత్యకు గురైన వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని..కేసు దర్యాప్తులో ఉందని నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu