యువతిని వేధిస్తున్న కేసులో జనసేన పార్టీ సభ్యుడి అరెస్ట్..
posted on Mar 12, 2016 3:49PM

ఓ యువతిని వేధిస్తున్నాడు అంటూ జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేసిన వైనం విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్టణానికి చెందిన చంద్రశేఖర్ సాకేటి సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఫేస్ బుక్ లో హైదరాబాదు నగరానికి చెందిన ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో హైదరబాద్ వచ్చినప్పుడల్లా చంద్రశేఖర్ ఆమెను కలిసేవాడు. అయితే ఆ అమ్మాయి చనువును అవకాశంగా తీసుకున్న అతను మొదట ప్రేమ, ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో చంద్రశేఖర్ వారిద్దరూ కలిసినప్పుడు తీసుకున్న ఫొటోలు, అసభ్యకరమైన మెసేజ్ లు.. కామెంట్లు పోస్ట్ చేస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని పట్టుకున్నారు.