వారి మాటల్లో నిజం ఉంది- మోదీ!
posted on Feb 26, 2016 11:21AM
.jpg)
పార్లమెంటు ఉభయసభల్లోనూ తన సహచరులు చేసిన ఉద్వేగపూరిత ప్రసంగాలక మోదీ పులకరించిపోయినట్లున్నారు. ఇంతకు ముందే స్మృతి ఇరానీ ప్రసంగాన్ని జోడిస్తూ ఆయన సత్యమేవ జయతే అంటూ ట్విట్టర్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే! తాజాగా అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్ ప్రసంగాలను ఉట్టంకిస్తూ ‘వారి మాటలన్నీ విచక్షణతో కూడుకున్నవనీ, అవన్నీ అక్షర సత్యాలనీ’ ప్రశంసించారు మోదీ! మోదీ పేర్కొన్న సహచరులంతా గురువారం పార్లమెంటులో తన వాక్పటిమను చూపినవారే. వారి మాటల్లోని మెరుపు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది కూడా! ఉదాహరణకు భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ జేఎన్‌యూ విద్యార్థుల ప్రసంగాలు ‘భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, ఇండియా నుంచి స్వేచ్ఛను పొందాలన్న భావ ప్రకటన’ అంటూ విమర్శించారు. మరి ఇలాంటి మెరుపులకు మోదీ మురిసిపోకుండా ఎలా ఉంటారు!