'టైమ్స్' ఆఫ్ మోదీ!


నరేంద్ర మోదీ... ఈ పేరు ఇండియాలో ఫుల్ పాప్యులర్. ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేని విశేషణం. కాని, ఇప్పుడు ప్రపంచం కూడా నమోకి నమోన్నమః అనేస్తోంది! అందుకు తాజా ఉదాహరణ టైమ్స్ మ్యాగజైన్ ఆన్ లైన్ సర్వేనే!


టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతీ యేటా ప్రకటించే ఈ అవార్డ్ చాలా ఫేమస్. వెస్టన్ మీడియాలో కూడా చాలా మంది దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అంతే కాదు, టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఊరికే పాప్యులారిటీని బట్టీ ఇచ్చేయరు. గడిచిన సంవత్సర కాలంలో ఒక వ్యక్తి ప్రపంచం మీద ఎంత ప్రభావం చూపారో అంచనా వేసి .... అప్పుడు పోల్ నిర్వహిస్తారు. అంటే... టైమ్స్ పోటీదారుల జాబితాలోకి రావటమే పెద్ద సక్సెస్ అనుకోవచ్చు. అందుకే, వైట్ హౌజ్ లోకి కాలుపెడుతోన్న ట్రంప్, వైట్ హౌజ్ నుంచి బయటకి వచ్చేస్తోన్న ఒబామా, వైట్ హౌజ్ లోకి వెళ్లలేకపోయిన హిల్లరీ... ఇలాంటి మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్స్ టైమ్స్ లిస్ట్ లో చోటు సంపాదిస్తారు. అమెరికన్సే కాదు వాల్డ్ వైడ్ గా విపరీత ప్రభావం చూపిన ప్రతీ ఒక్కరూ టైమ్స్ జాబితాలోకి వస్తారు. అలానే మన మోదీ కూడా టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కోసం బరిలోకి దిగారు... 


అమెరికన్ పత్రిక అయిన టైమ్స్ ఆన్ లైన్ పోల్ లో అమెరికన్ ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్ పోస్టుకి పోటీ పడిన వారితో కాంపిటీషన్లో వుండటమే కాక భారీ తేడాతో విజయం సాధించటం మామూలు విషయం కాదు. కాని, ఆశ్చర్యకరంగా మోదీ అమెరికన్ సెలబ్రిటీల్ని అమెరికన్ పత్రిక నిర్వహించిన పోల్ లోనే ఓడించారు. ఏకంగా 18శాతం ఓట్లు సంపాదించారు. ఆయన తరువాతి స్థానాల్లో వున్న ట్రంప్, ఒబామా లాంటి వారు 7శాతం దగ్గరే ఆగిపోయారు! అంటే డబుల్ ఓట్లు మోదీకి అనుకూలంగా పోలయ్యాయన్నమాట!


నెటిజన్స్ ఓట్ల ద్వారా ఎంపిక చేసే టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ విషయంలో ఆ పత్రిక ఎడిటర్స్ ది ఫైనల్ డిసిషన్. ఈ సంవత్సరం మోదీని విజేతగా వారు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది. అయితే ఆయన సక్సెస్ కి కారణం ఇండియాలోని మోదీ ఫాలోవర్స్ వేసిన ఓట్లే కాక అమెరికాలోని నమో బ్రిగేడ్ కూడా అంటున్నారు. అంతే కాదు, టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ డీమానిటైజేషన్ నెగటివ్ ఎఫెక్ట్ కూడా ఒట్టిదేనని తేల్చేసిదంటున్నారు మోదీ భక్తులు! సామాన్య జనం క్యూలలో నిలబడాల్సి వచ్చినా కూడా మోదీ క్రేజ్ ఏం తగ్గలేదంటున్నారు. అది చెప్పటం కష్టమే అయినా మన ప్రధాని ప్రతిష్ఠాత్మక టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా నిలవటం మాత్రం గర్వకారణమే!