టీడీపీ నేత మృతి పట్ల.. లోకేశ్ దిగ్భ్రాంతి
Published on: Sun Jul 20, 2025 3:08PM

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామానికి చెందిన టీడీపీ నేత నంబూరి శేషగిరి రావు గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2024 సాధారణ ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ లోని ఓ బూత్ లో వైసీపీ నేతలు సాగించిన విధ్వంసం పట్ల ఆయన ఎదురొడ్డి నిలిచారు.
శేషగిరి రావు పోరాటం టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఎంతో స్ఫూర్తి నింపింది. ఆయన మరణం పార్టీకి తీరని లోటని లోకేశ్ పేర్కొన్నారు. శేషగిరి రావు కుటుంబానికి పార్టీ అన్నివిధాల అండగా ఉంటుంది. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని ఎక్స్ వేదిక నారా లోకేశ్ తెలిపారు


