కేసీఆర్‌కి‌ "టచ్‌"లో నాగార్జున..!

స్వతహాగా సినిమా వాళ్లతో..రాజకీయ నాయకులు ఎప్పుడు టచ్‌లోనే ఉంటారు. అలాగే పొలిటీషియన్స్ కూడా ఇండస్ట్రీ వాళ్లకి అందుబాటులోనే ఉంటారు..ఇందులో ఎవరి అవసరాలు వారివి..ఎవరి లెక్కలు వారివి. అందుకే రెండు భిన్న ధ్రువాల్లాంటి ఈ రెండు రంగాలు పాలు నీళ్లలా కలిసిపోయి ఉంటాయి. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హీరో నాగార్జున కలిశారు. అప్పటి నుంచి రాజకీయ వర్గాలతో పాటు పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

 

నాగార్జున ఏం చేసినా..దాని వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉంటుంది. తనకు లాభం లేకుండా నాగ్ ఏ పని చేయరని ఆయన గురించి ఇండస్ట్రీలో అనుకునే మాట. తన రాజకీయ, వ్యాపార అవసరాల కోసం ముఖ్యమంత్రులతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ వచ్చారు నాగ్..ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్, కిరణ్‌ కుమార్‌లతో సన్నిహితంగా మెలిగిన కింగ్ ఇప్పుడు కేసీఆర్ భజన చేస్తున్నారు. ఆ ఫ్రెండ్‌షిప్‌తో ఎన్నో అంశాల్లో లబ్ధి పొందారు నాగార్జున. అక్రమ కట్టడాల విషయంలోనూ..ఆక్రమణల తొలగింపు విషయంలోనూ ప్రభుత్వం అక్కినేని ఆస్తుల జోలికి వెళ్లకపోవడానికి కారణం నాగ్‌తో కేసీఆర్‌ గల రిలేషనే అని అప్పట్లో ప్రచారం జరగింది.

 

ఇటువంటి పరిస్థితుల్లో నాగార్జున ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జరగనున్న ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి..వచ్చే నెలలో జరగనున్న తన కుమారుడు నాగచైతన్య వివాహా రిసెప్షన్‌కు సీఎంను ఆహ్వానించారట నాగ్. కంటి ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్‌ను పరామర్శించే పేరిట ఈ పలకరింత జరిగినప్పటికీ దీని వెనుక వేరే రహస్యం ఉందంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే వచ్చేది ఎన్నికల సీజన్ కాబట్టి కారణం ఏదైనా కావొచ్చు..అదేంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.