ఎంఎస్ నారాయణ సతీమణి మృతి.. మలయాళ నటి కల్పన మృతి
posted on Jan 25, 2016 1:32PM

ప్రముఖ హాస్యనటుడు, దివంగత ఎంఎస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ (63) ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాదితో బాధపడుతున్న ఆమె ఈరోజు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మృతి చెందారు. ఇప్పటికే హాస్య నటుడు మరణించి ఎంఎస్ నారాయణ మరణించి జనవరి 23 నాటికి ఏడాది అయింది. మొన్న ఎంఎస్ నారాయణ ప్రధమ వర్ధంతి జరిగింది. అది జరిగిన రెండు రోజులకే కళాప్రపూర్ణ మృతి చెందారు.దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
మరోవైపు ప్రముఖ మలయాళ నటి కల్పన (50) కూడా ఈరోజు కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ కార్యక్రమానికి వచ్చిన ఆమె గుండెపోటుతో మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఓ ప్రయివేట్ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన ఆమె తాను బస చేసిన హోటల్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి .... హుటాహుటీన జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కల్పన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కల్పన ప్రముఖ నటి ఊర్వశి సోదరి.