రాజాసింగ్ పై 17 కేసులు... రేవంత్ రెడ్డిపై 7 కేసులు...

తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల వివరాలను ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ ప్రకటించింది. ఆర్టీఐ ద్వారా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలను సేకరించిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌... గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. కేసుల విచారణ దర్యాప్తు త్వరగా పూర్తయ్యేలా చూడాలని తమిళిసైకి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తిచేసింది. అయితే ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ వెల్లడించిన డిటైల్స్ ప్రకారం మొత్తం 17 కేసులతో అందరి కంటే ముందున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్... ఇక ఆ తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి నిలిచారు. రేవంత్ పై మొత్తం 7 కేసులు ఉన్నాయి. అలాగే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై 6 కేసులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై 5 కేసులు.... టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.రాజయ్యపై 5 కేసులు... టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌పై 4 కేసులు ఉన్నట్లు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌  తెలిపింది. ఇక సంపత్‌కుమార్‌పై 4 కేసులు ఉండగా, మంత్రి తలసానిపై 3 కేసులు... కాసిపేట లింగయ్యపై 3 కేసులు... జూపల్లి కృష్ణారావుపై 3 కేసులు... మాజీ స్పీకర్ మధుసూదనాచారిపై 3 కేసులు ఉన్నట్లు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ ప్రకటించింది.