ఎంచక్కా సెల్ఫీ తీసుకున్న కోతి...
posted on Jul 1, 2017 12:20PM

సెల్ఫీ పిచ్చి ఉన్నచాలామందిని మనం చూసే ఉంటాం. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ రోజుకు ఒక్కసారైనా సెల్ఫీ తీసుకుంటూనే ఉంటారు. ఇక సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయిన ఎంతోమందిని మనం చూశాం. ఇప్పుడు ఏకంగా ఓ కోతి సెల్పీ దిగీ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని జూలో ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అసలు సంగతేంటంటే.. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని జూకి రెబెక్కా అనే యువతి వెళ్లింది. జూకి వెళ్లిన ఆమె అక్కడ కాపుచిన్ జాతికి చెందిన రొమాని అనే కోతిని రెబెక్కా ఫొటో తీయాలనుకుంది. కానీ ఇంతలో రొమాని ఫెన్సింగ్ వద్దకు వచ్చి రెబెక్కా ఫోన్‌లాక్కొని చక్కగా సెల్ఫీ దిగింది. దాంతో అక్కడున్న పర్యాటకులు షాకయ్యారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. లైక్‌లు, కామెంట్లతో హల్ చల్ చేస్తుంది.