క్రికెట్ ప్రపంచ కప్‌ని ఆవిష్కరించిన మోడీ
posted on Nov 18, 2014 3:44PM

ఆస్ట్రేలియా పర్యటనలో వున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ ప్రపంచ కప్‌ని ఆవిష్కరించే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. మెల్‌బోర్న్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో నరేంద్రమోడీ వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ క్రికెట్ కప్‌ని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌తోపాటు ఆస్ట్రేలియా క్రికెటర్లు మెక్ గ్రాత్, స్టీవ్ వా తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఇచ్చిన విందును స్వీకరించిన అనంతరం మోడీ తన నాలుగు రోజుల ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని ఫిజి దేశానికి బయల్దేరారు. ఈరోజుతో తన ఆస్ట్రేలియా పర్యటన పూర్తయిందని, ఈ పర్యటనను తాను ఎన్నటికీ మరచిపోలేనని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. తన పర్యటన వల్ల ఆస్ట్రేలియా, భారత దేశాల మధ్య కొత్త బంధం ఏర్పడిందని ఆయన అన్నారు.