మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్‌ మృతి

మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడైన ఓం ప్రకాశ్ మృతి చెందాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓం ప్రకాశ్.. విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఓం ప్రకాశ్ మృతిని జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ ధృవీకరించారు. ఓంప్రకాశ్‌ మూత్రపిండాలు చెడిపోవడంతో డయాలసిస్‌ చేయించేవారు. శుక్రవారం కూడా కేజీహెచ్‌లోనే డయాలసిస్‌ జరిగిందని జైలు సూపరింటెండెంట్‌ వివరణ ఇచ్చారు.

కాగా, టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శ్రీనును ఓం ప్రకాశ్ జైలులో హత్య చేశాడు. తనను డిస్ట్రబ్ చేస్తున్నాడనే నెపంతో తలపై డంబుల్‌ తో కొట్టి చంపేశాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఓం ప్రకాశ్‌ కు జీవిత ఖైదు విధించింది. అప్పటించి ఓం ప్రకాశ్ విశాఖ సెంట్రలో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ మృతి చెందాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu