మోపిదేవి అరెస్ట్ పై సిబీఐ వత్తిడి పెంచుతున్నబి.సి. సంఘాలు

minister mopidevi arrest, mopidevi arrested, mopidevi in jail, mopidevi CBI custodyవాన్ పిక్ వ్యవహారంలో మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణను సిబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో తాజాగా ఆయన కథలో ఓ కొత్తమలుపు చోటు చేసుకుంటోంది. మత్స్యకారుడైన వెంకటరమణను వదిలేస్తారని ఇంతవరకూ ఎదురుచూసిన ఆయన బంధువులు రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారుల సంఘాలతో ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా బి.సి.సంక్షేమశంఘం కూడా ఈయనను కాపాడుకోవాలని కదిలింది. దీంతో ఈయనను కేసు నుంచి బయటపడేసేందుకు నిరసన కార్యక్రమాలు ఇకపై హోరెత్తనున్నాయి. అన్ని జిల్లాల సంఘాలను రాష్ట్రరాజధానికి రప్పించి బి.సి. అయినందునే మోపిదేవిని ఎరగా వాడారని ఆందోళనకు నేపథ్యాన్ని చూపుతున్నారు. జగన్ లాంటి చేపకోసం సిబీఐ ఎరగా వాడుకున్న తరువాత వెంకటరమణను ఎందుకు వదలలేదని ఆందోళనకారులు ప్రభుత్వాన్ని డిమాండు చేయనున్నారు. మే 24న మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేశారు. ఆ తరువాత ఆయన తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. డానికి ముందు సిబీఐ అరెస్టు చూపేటప్పుడు జి.వో.లపై తనకేమీ తెలియదని, అప్పటి సిఎం రాజశేఖరరెడ్డి తనను పిలిపించుకుని ఫైలుపై సంతకం చేయించారని ఆరోపించారు. అరెస్టై మంత్రి పదవికి రాజీనామా చేశాక సిఎం కిరణ్ కు ఆయన ఒక లేఖ రాశారు. తనను వై.ఎస్.ఆర్. సిఎం కార్యాలయానికి పిలిపించుకుని కార్యదర్శి సమక్షంలో సంతకాలు తీసుకున్నారని తెలిపారు.

 

 

అయితే ఆ తరువాత జగన్ ను అరెస్టు చేశారు. జగన్ తో సన్నిహితునిగా చెంచల్ గూడ జైలులో ఉంటున్న మోపిదేవి తన బెయిల్ పిటీషన్ లో ఆరోపణలు మార్చారు. వై.ఎస్. ప్రస్తావన ఎక్కడా లేకుండా ప్రధానకార్యదర్శి తదితరులు ప్రతిపాదనలను పంపితే మంత్రివర్గం ముందుంచానని మోపిదేవి వివరించారు. మంత్రివర్గం చర్చించి ఈ నిర్ణయం తీసుకుందని నమోదు చేసిన అంశానికి పొంతన లేకుండా మోపిదేవి ఇంకా పలు అనుమానాలకు తావిచ్చారు. అయితే సిబీఐ కూడా మోపిదేవి కస్టడీలో ఉడడంతో అతి పెద్ద నేరమైన మనీ లాండరింగ్ వ్యవహారం చుట్టూ కేసును నడిపింది. ఈ దశలోనే ఈది జగన్ కేసులో విచారణ ప్రారంభించింది. తాజాగా జగన్ ను చెంచల్ గూడ జైలులోనే విచారించేందుకు అనుమతి తీసుకుంది. దీంతో ఆ విచారణలో ఈది జగన్ ను మనీలాండరింగ్ వ్యవహారంలో ప్రశ్నిస్తుంది. దీంతో సిబీఐ వాన్ పిక్ వ్యవహారం తేల్చే అవకాశమే కనిపించటం లేదు. అందువల్ల మోపిదేవి విషయం తేలటానికి ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విచారణ జరగకుండా తనను ఖాళీగా ఉంచుకున్న సిబీఐ ఇంకా తాత్సారం చేసే అవకాశాలు ఉన్నాయని మోపిదేవి తన బంధువులకు తెలియజేశారు. దీంతో కొత్త మలుపుకు ఆయనే స్వయంగా బీజం వేసుకున్నట్లు అయింది. ఈ నిరసనల హోరు రాష్ట్రప్రభుత్వాన్ని కదిలిస్తే ఖచ్చితంగా బెయిల్ దొరికే అవకాశం ఉంటుందని వెంకటరమణ ప్లాన్. ఈ ప్లాన్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో తెరపైనే చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu