కుక్కపిల్ల హత్య... ఆచూకీ చెబితే లక్షరూపాయలు

మార్చి 14, దిల్లీలోని గ్రీన్‌పార్క్‌ మెట్రో స్టేషన్‌- అక్కడ ఒక కుక్కపిల్ల నిర్జీవంగా పడి ఉంది. మరికొన్ని కుక్కపిల్లల మీద బలమైన కత్తిపోట్లు ఉన్నాయి. వీటి మీద ఎవరో పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు, గాయాలు చూస్తేనే తెలిసిపోతోంది. రైల్వే స్టేషనులోని సీసీటీవీ ఫుటేజిని గమనించాక, ఇది నిజమేనని తేలిపోయింది. 30ల వయసులో ఉన్న ఓ ఆగంతకుడు, కత్తితో కుక్కపిల్లల మీద దాడి చేయడం అందులో స్పష్టంగా కనిపించింది.

దాంతో వెంటనే అతని చిత్రాన్ని గీయించి పంచిపెట్టారు. అతని గురించి ఎలాంటి సమాచారాన్ని అందించినా లక్ష రూపాయల బహుమతిని అందించనున్నట్లు ‘ఫౌనా పోలీస్‌’ అనే స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకు వచ్చింది. ఇక స్థానిక పోలీసులు కూడా కేసుని నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రీన్‌ పార్క మెట్లో స్టేషన్‌ వద్ద కొద్దిరోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటన జరిగిందని చెబుతున్నారు. అంటే కుక్కల మీద దాడి చేసే సీరియల్‌ కిల్లర్లు కూడా బయల్దేరారన్నమాట!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu