మల్లి మస్తాన్‌బాబు మరణించాడు

 

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు చిలీలో పర్వతారోహణ చేస్తూ అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆయన మరణించినట్టు తెలుస్తోంది. మార్చి 24న పర్వతారోహణ చేస్తూ అతను చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణం చిక్కుకున్నాడు. అతని ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మస్తాన్ బాబు మృతదేహాన్ని ఏరియల్ గుర్తించారు. మల్లిమస్తాన్ బాబుది నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంగం. పర్వతారోహణ చేసే సమయంలో తన కుమారుడి జాడ అనేక రోజులు తెలియకపోవడం మామూలే అని ఆయన తల్లి ఇంతకాలం పెద్దగా బాధపడలేదు. అయితే ఎన్నిరోజులైనా కుమారుడి జాడ తెలియకపోవటంతో మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ అనారోగ్యానికి గురైంది. ఏపీ ముఖ్యమంత్రిని కూడా కలసి తన కుమారుడి జాడ కనుక్కోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఇప్పుడు మల్లి మస్తాన్ బాబు మరణించాడన్న వార్త తెలిసి ఆమె కుప్పకూలిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu