మహేష్ 'శివం' ఎప్పుడు మొదలవుతుందో?
posted on Jun 26, 2013 2:42PM

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, క్రిష్ కలయికలో రూపొందనున్న 'శివం' సినిమా లేటెస్ట్ గా మరోసారి వార్తల్లోకి వచ్చింది. మహేష్ బాబు 'శివం' సినిమా చేయబోతున్నాడని తెలియజేసింది బాలీవుడ్ రౌడీ గర్ల్ సోనాక్షి సిన్హా. దీంతో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెలుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మహేష్ బాబు అభిమానులు. మహేష్ 'శివం' మూవీ 2014లో మొదలు కావచ్చునని అంటున్నారు. అప్పటికి మహేష్, సోనాక్షిల పెడ్డింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అవుతాయని చెబుతున్నారు. కొన్ని నెలల క్రితమే 'శివం' మూవీని నిర్మించబోతున్నట్లు అశ్వినీదత్ తెలిపారు.
సోనాక్షి శివం సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ... ''క్రిష్ శివం సినిమా స్టోరీ చెప్పగానే ఎంతో ఉద్వేగభరితంగా అనిపించింది. క్రిష్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు బాలీవుడ్ లో బిజీ గా ఉన్నాను..ఇప్పుడు తెలుగు లో సినిమా చేయలేను అని వినయంగా తిరస్కరిద్దామనుకున్నాను. కథ విన్నాక ఉత్కంఠను ఆపుకోలేకపోయాను. నేను చేసిన పాత్రలన్నీటికంటే..శివం లో చేస్తున్న పాత్ర నాకు మంచి పేరు వస్తుందని'' చెప్పింది