నాన్నతో నా వల్ల కావడం లేదు-నారా లోకేశ్

విశాఖలో జరుగుతున్న టీడీపీ మహానాడులో తన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారాలోకేశ్. ఈ వయసులో కూడా చంద్రబాబు ఎంతో చురుకుగా పనిచేస్తున్నారన్నారు. ఆయన వేగంతో తాను పోటీ పడలేకపోతున్నానని చెప్పారు. ఏపీకి రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.42.92 కోట్లు ఖర్చు చేశామని, వారి పిల్లల కోసం రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. దేశంలో మరే ఇతర పార్టీ కూడా కార్యకర్తల కోసం ఇన్ని నిధులను వెచ్చించలేదన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu