మధు మతిపోయేలా ఉంది
posted on Dec 13, 2013 4:08PM

ఇప్పటివరకు యాంకర్ గా అలరించిన హాట్ లేడి ఉదయభాను హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం "మధుమతి". ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటాయో అని ఆశించి వెళ్ళే జనాలందరికీ కూడా ఈ సినిమా ఒక తలనొప్పిగా ఉంటుంది. సినిమా కథలో ఎలాంటి కొత్తదనం లేకపోగా, చూస్తున్నంతవరకు కూడా చిరాకు కలిగిస్తుంది. అసలు ఈ సినిమా కథ ఏమిటంటే... కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఉదయభానుకి హీరోతో పెళ్లి జరుగుతుంది. హీరో ఇంటికి వెళ్లిన ఈ అమ్మడు.. అక్కడ అత్తగారింటిలో అందరితో కలిసిపోతుంది. ఇంతలో అనుకోకుండా 50 లక్షల నగలతో మధుమతి జంప్ అయిపోతుంది. ఇక్కడ ఇంటర్వెల్. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేది మిగతా కథ. ఉదయభాను ఈ సినిమాలో అందాల విందు చేస్తాదనుకొని వెళ్తే మాత్రం వారికి ఖచ్చితంగా తీవ్ర నిరాశే తప్పదు.