కేసీఆర్ కే షాకిచ్చిన ఎమ్మెల్యే

తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ను గట్టిగా ప్రయోగిస్తోంది. నయానో భయానో వారిని గులాబీదళంలోకి తీసుకొచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా అప్పట్లో వైఎస్ అనుసరించిన తీరునే కేసీఆర్ ఫాలో అవుతున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు వల వేస్తూ వారిని పార్టీలోకి లాగేసుకుంటున్నారు. కేసీఆర్ తీరుతో ఎమ్మెల్యేలు కూడా అయిష్టంగానే టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు రెడీ అయిపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇండిపెండెంట్ గా ఉన్నా ఓ ఎమ్మెల్యే మాత్రం టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగలేదు. ఏకంగా కేసీఆర్ కే షాకిస్తూ కాంగ్రెస్ లో చేరిపోయారాయన. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు దొంతి మాధవ రెడ్డి.

 

దొంతి మాధవరెడ్డి టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎదుర్కొని మరీ భారీ మెజార్టీతో ఇండిపెండెంట్ గా గెలిచారు.  ప్రభుత్వానికి పెద్ద మెజార్టీ లేకపోవడంతో అప్పట్లో మాధవరెడ్డి పార్టీలోకి వచ్చేస్తారని టీఆర్ఎస్ గట్టిగానే నమ్మింది. అందుకు సంబంధించి ప్రయత్నాలు కూడా చేశారు గులాబీ నేతలు. కానీ టీఆర్ఎస్ లోకి రానని మాధవరెడ్డి వారికి  మొహం మీద చెప్పేశారట. చివరకు టీఆర్ఎస్ లోకి రాకపోతే నియోజకవర్గ డెవలప్ మెంట్ జరగదని కూడా అధికారపార్టీ నుంచి సిగ్నల్స్ వచ్చాయట. అయినా మాధవరెడ్డి బెదరలేదు. చివరకు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కూడా పిలుపొచ్చినా మాధవరెడ్డి నో అనేశారని ప్రచారం జరుగుతోంది. అన్నీ ఆలోచించి చివరకు కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయించేసుకొని కరెక్టుగా అసెంబ్లీ సమావేశాలకు ముందురోజు ఆయన ఆపార్టీలో చేరిపోయారు. దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడంతో సీఎం కేసీఆర్ సహా మంత్రులు, టీఆర్ఎస్ నేతలు షాక్ అయిపోయారట. మాధవరెడ్డి కారెక్కుతారని ఎంతో ఆశిస్తే ఇలా ఎలా జరిగిందని గుసగుసలాడుకుంటున్నారట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu