రాజకీయ ఎన్నికలుగా 'మా' ఎన్నికలు

 

మా అసోసియేషన్ అధ్యక్ష (మా) పదవి ఎన్నికల పోటీ రాజకీయ ఎన్నికల కంటే వేడిగా జరగతోంది. సిమీ ఎన్నికలను రాజకీయ ఎన్నకలు చేసేశారు. ఓ వైపు జయసుధ మరోవైపు రాజేంద్రప్రసాద్ ఎవరూ తగ్గేలా లేరు. బుధవారం ‘మా’ అధ్యక్షపదవికి పోటీచేస్తున్న రాజేంద్రప్రసాద్‌, ఆయన ప్యానెల్‌ మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో నాగబాబు, కాదంబరి కిరణ్, శివాజీరాజా తదితరులు హాజరయ్యారు. ఇన్ని సంవత్సరాలుగా హాస్యంతో సినీ కళామాతల్లికి సేవచేశానని, సేవ చేయడానికి మనసు, సంకల్పం ఉంటే చాలని అన్నారు. ఇదొక ధర్మ యుద్ధమని, ఈ ధర్మయుద్ధంలో మంచి చేయడానికి రావడమే పాపమా? అని రాజేంద్రప్రసాద్‌ ప్రశ్నించారు. తనతో పోటీపడే స్థాయి మరెవరికీ లేదని వ్యాఖ్యానించారు. మా అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్‌ పేరును ప్రకటించిన తర్వాతనే జయసుధ పేరును ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలయ్యే వరకు రాజేంద్రప్రసాద్‌కే తాము మద్దతిస్తామని నాగబాబు స్పష్టం చేశారు. శివాజీ రాజా మాట్లాడుతూ తన క్యారెక్టర్‌ ఏంటో సినీ వర్గాలందరికీ తెలుసునని, ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం పేద కళాకారులకు న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu