దొంగతనం కేసులో రచయిత కులశేఖర్

 

ఒకప్పుడు సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ చిత్రాలన్నింటికీ చక్కని పాటలు అందించిన పాటల రచయిత కులశేఖర్ అందరికి సుపరిచితుడే. అయితే ఈ సుపరిచితుడిలో మరో అపరిచితుడు కూడా ఉన్నాడని ఇటీవలే తెలిసింది. కులశేఖర్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ త్రిపురసుందరి ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహానికి ఉన్న 350 గ్రాముల వెండి కిరీటాన్ని దొంగిలించాడు. ఈ విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో, న్యాయమూర్తి అతనికి ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. అందమైన పాటలను రాసే ఈ రచయితలో మరో అపరిచితుడు కూడా ఉన్నాడని తెలిసి, సినీపరిశ్రమ షాక్ కు గురైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu