ఉభయ సభలు గురువారానికి వాయిదా
posted on Aug 20, 2013 5:11PM

బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణానికి సంభందించి గొడవతో ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి.బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు మాయం కావడంతో.. ఆ అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా ప్రకటన చేయాలని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తూ పదే పదే సభను అడ్డుకుంది దీంతో సభ ఉదయం నుంచి పలుమార్లు వాయిదా పడింది. తరువాత కూడా పరిస్థితి సర్ధుకోకపోవడంతో చివరకు గురువారానికి వాయిదా పడింది.
బొగ్గు కుంభకోణంలో కనపడకుండా పోయిన పత్రాల్లో కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉన్నాయని ఆరోపించిన బిజెపి ప్రదాని లోక్‌సభకు వచ్చి సమాదానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ విషయం పై మాట్లాడిన సుష్మాస్వరాజ్ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే స్వయంగా ప్రదానిని తీసుకువచ్చి ఈ అంశంపై వివరణ ఇప్పించాలని కోరారు.
బీజేపీ, జేడీయూ, శివసేన సహా మొత్తం ఎన్డీయే సభ్యులంతా ఈ అంశంపై పట్టుబట్టి సభను స్తంభింపజేశారు. అదే సమయంలో టీడీపీ నాయకులు సమైక్యాంధ్ర నినాదాలతో సభను హోరెత్తించగా, సీపీఎం సభ్యులు ధరల పెరుగుదల అంశాన్ని ప్రస్తావించారు. దీంతో మూడుసార్లు వాయిదా పడిన సభ, బుధవారం రాఖీ సందర్భంగా సభకు సెలవు కావటంతో చివరకు గురువారానికి వాయిదా పడింది.