కాంగ్రెస్ గూటికి టిఆర్ఎస్ నాయ‌కులు

 

టిఆర్ఎస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రక‌ట‌న చేసిన ద‌గ్గర నుంచి అయోమ‌యంలో ప‌డిన టిఆర్ఎస్ నాయ‌కుల‌కు ప్రస్థుత ప‌రిణామ‌లు మింగుడుప‌డ‌టం లేదు. ఆ పార్టీ నేత‌లు మాజీ మంత్రులు విజ‌య‌రామారావు, చంద్రశేఖ‌ర్‌ల‌తొ పాటు టిఆర్ ఎస్ పార్టీ బ‌హిష్కృత నేత రఘునంద‌న్‌రావులు మంగ‌ళ‌వారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవ‌హారాల ఇంచార్జ్ దిగ్విజ‌య్‌సింగ్ కండువా క‌ప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేర‌డానికి ముందు ఈ నాయ‌కులు ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డితో స‌మావవేశం అయి చ‌ర్చలు జ‌రిపారు. త‌రువాత దిగ్విజ‌య్‌సింగ్ నివాసానికి చేరిన టిఆర్ఎస్ నాయ‌కులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇచ్చింద‌ని తెలంగాణ ప్రజ‌లు కాంగ్రెస్ పార్టీకి రుణ‌ప‌డి ఉంటార‌ని అన్నారు.అలాగే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ప్రకటించిన కె. చంద్రశేఖరరావు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News