నిన్న లాలూ.. ఈరోజు కూతురు..

 

ఆర్జేడీ అధినేత లాలూ కుటుంబంపై ఇప్పటికే సీబీఐ అధికారులు దాడి చేసి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  12 స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేసి షాకిచ్చారు. ఇప్పుడు తాజాగా లాలూ కూతురు మిసా భారతి ఇంటిపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. అతి తక్కువ ధరలకే భూములు కొల్లగొట్టారని, పెద్ద మొత్తంలో ఆస్తులు కూడ బెట్టారనే ఆరోపణల కిందట దాడులు నిర్వహించిన అధికారులు మిసాభారతీ ఆమె భర్త శైలేష్‌ కుమార్‌ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా గతంలో కూడా ఈడీ అధికారులు మిసా భారతి ఇంటిపై దాడులు జరిపి.. పలు నోటీసులు కూడా జారీ చేశారు.