బీజేపీ సీనియర్లు మళ్ళీ ఏమి బాంబు ప్రేలుస్తారో?
posted on Dec 24, 2015 6:15PM
.jpg)
బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, శాంత కుమార్ ఈరోజు డిల్లీలో మురళీ మనోహర్ జోషి ఇంట్లో సమావేశం అవడం అందరినీ ఆకర్షిస్తోంది. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై ఆరోపణల నేపధ్యంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వారు నలుగురు చర్చించి ఉండవచ్చని తెలుస్తోంది. వారు తమ సమావేశ వివరాలను మీడియాకు తెలియజేయకపోవడంతో వారు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై తమ అసమ్మతిని బహుశః లేఖ ద్వారా పార్టీ అధిష్టానానికి తెలియజేవచ్చని పార్టీలో నేతలు భావిస్తున్నారు.
అరుణ్ జైట్లీని విమర్శించినందుకు ఎంపి కీర్తి ఆజాద్ ని పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని అద్వానీ శిష్యుడుగా చెప్పుకోబడుతున్న శత్రుఘన్ సిన్హా తప్పు పట్టారు. బహుశః ఆయన వారి ఆభిప్రాయన్నే వ్యక్తం చేసి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ రేపు అద్వానీ తదితరులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లయితే, బీజేపీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసివస్తే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు జవాబు చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడవచ్చును.