ఏసీబీ ఎదుట వేం నరేందర్ తనయుడు
posted on Jul 15, 2015 2:31PM

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు ఎవరో ఒకరికి నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ లకు తరువాత ఈ కేసులో నిందితులుగా భావించి తెదేపా నేతలైన వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలకు నోటీసులు జారీ చేసి వారిని విచారించింది. ఇప్పుడు ఈ కేసులో వేం నరేందర్ రెడ్డి తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డి కు కూడా సెక్షన్ 160 కింద ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణ కీర్తన్ రెడ్డి ఈరోజు ఏసీబీ ఎదుటు హాజరయ్యారు. కాగా వేం నరేందర్ కొడుకు కృష్ణ కీర్తన్ రెడ్డి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అయితే అతను రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహాలతో మాట్లాడినట్టు ఏసీబీ గుర్తించడంతో అతనికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.