కొణతాల రాజీనామాను జగన్ ఆమోదించారు: అమర్నాథ్ రెడ్డి

 

కొణతాల రామకృష్ణ రాజీనామాను వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆమోదించినట్లు ఆ పార్టీ యంపీ గుడివాడఅమర్నాద్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్నికొణతాలకు మీడియాకు తెలియజేయమని జగన్ తనను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడి ఎంతో నమ్మకంగా సేవచేసిన కొణతాలను జగన్ వదులుకోవడం పెద్ద తప్పేనని చెప్పవచ్చును. కానీ ప్రస్తుతం ఎన్నికలేవీ లేవు కనుక పార్టీకి పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చును. ఇదివరకు రాష్ట్ర విభజనకు ముందు అటువంటి నేత కొండా సురేఖను కూడా జగన్ వదులుకొన్నారు. కానీ జగన్ మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో పునః ప్రవేశించాలని చూస్తున్నపుడు ఆమె లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. బహుశః కొణతాల విషయంలో కూడా మున్ముందు ఇటువంటి పరిస్థితే ఎదురయినప్పుడు, ఆయనను వదులుకొన్నందుకు తీరికగా పశ్చాతాప పడతారేమో? కొణతాల రామకృష్ణతో పాటు ఆయన తమ్ముడు మరియు వారి అనుచరులు కూడా పార్టీని వీడుతారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.