కిరణ్‌రెడ్డి చెప్పిన పెళ్లికూతురు తెలిసినట్లేనా? లేక ఉత్తుత్తి ప్రచారమేనా?


 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా... గత ఎన్నికల్లో కనీసం తన సొంత నియోజకవర్గంలోనూ పట్టు నిలుపుకోలేకపోయిన మాజీ సీఎం కిరణ్‌‌కుమార్‌‌రెడ్డి....మరోసారి వార్తల్లోకి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లినా ఘోర పరాజయాన్ని చవిచూడటంతో అసలు ప్రజల్లోకి రావడమే మానేసిన ఈ మాజీ ముఖ్యమంత్రి..... ఈ రెండున్నరేళ్లలో రెండుమూడుసార్లు మాత్రమే మీడియాకి కనిపించారు. సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు సైతం కోల్పోవడంతో.... పొలిటికల్‌ లోప్రొఫైల్‌ పాటిస్తోన్న కిరణ్‌రెడ్డి‌.... రాజకీయంగా మళ్లీ యాక్టివ్‌ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

బీజేపీలో చేరుతున్నారని ఒకసారి.... కాదుకాదు టీడీపీలోకి వెళ్తారంటూ మరోసారి... లేదులేదు మళ్లీ పాత గూటికే చేరతారంటూ వార్తలు వచ్చినా అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఇవేమీ కాదు యువ నాయకత్వంలో కీ రోల్‌ పోషించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. గతంలో తాను తీవ్ర విమర్శలు చేసిన పార్టీల్లోకి వెళ్లడం కంటే... కొత్త పార్టీ జనసేన వైపు వెళ్లడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారన్న మాటలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి వదంతులే హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆమధ్య సొంత జిల్లా చిత్తూరులో ఓ పెళ్లికి హాజరైన కిరణ్‌‌రెడ్డి... ఇప్పటికైతే పెళ్లి కుదిరింది.... తాళిబొట్టు కట్టే తేదీ ఖరారైతే మీకందరికీ చెబుతానంటూ.... కొత్త రోల్‌పై అనుచరులకు క్లారిటీ ఇచ్చారు. దాంతో కిరణ్‌ ఏ పార్టీలో చేరతారోనంటూ కొద్దిరోజులు చర్చ నడిచింది.

 

పెళ్లి కుదిరింది.... పెళ్లికూతురు మాత్రం గోప్యమంటూ.... తాను చేరబోయే పార్టీ ఫిక్సైందన్న సంకేతాలిచ్చిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి.... సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన అంటూ వార్తలు వచ్చినా... కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం మళ్లీ పాత గూటినే ఎంచుకున్నట్లు చెబుతున్నారు. తనను ముఖ్యమంత్రిని చేసి... అందలమెక్కించిన కాంగ్రెస్‌‌లోనే తిరిగి చేరాలని డిసైడ్‌ అయ్యారట. అంతేకాదు కిరణ్‌కు ఏఐసీసీ స్థాయి పదవి కట్టబెడతారనే ప్రచారం కూడా జరిగిపోయింది. మరి ఇదైనా నిజమవుతుందో... లేక కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu