లగడపాటి సర్వే... కర్ణాటక ఎన్నికల్లో గెలుపువారిదే...


ఈ నెల 12 వ తేదీన కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారడంతో ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవాలని తెగ పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల భవిష్యత్తు ఓ రకంగా ఈ ఎన్నికలపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్దాలే చేస్తున్నారు. ఒకరినొకరు వేలెత్తి చూపించుకుంటూ.. విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అన్నది మాత్రం ఎన్నికలు అయిపోయి.. ఫలితాలు రావాల్సిందే. కానీ ఎన్నికల సమయంలో మాత్రం సర్వేలు చేయడం కామన్ థింగే. ఆ సంస్థ ఆ సర్వే చేసిందని.. ఈ సంస్థ ఈ సర్వే చేసిందని.. ఆ పార్టీ కి ఎక్కువ సీట్లు వస్తాయని.. ఇలా ఎన్నో వార్తలు వస్తుంటాయి.

 

అయితే ఈ సర్వేల సంగతి ఏమో కానీ.. కచ్చితమైన ఫలితాలను ప్రకటించడంలో లగడపాటి సర్వేది అందెవేసిన చేయి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కర్నాటక పీఠం ఎవరికి దక్కబోతోందనేదానిపై కూడా లగడపాటి సర్వే చేశారు.  ఒకట్రెండు సంస్థలు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పగా.. బీజేపీకి పట్టం ఖాయమని మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే మెజారిటీ సర్వేలు మాత్రం హంగ్ ఖాయమని, జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషించడం ఖాయమని చెప్తున్నాయి. ఇక గెలుపు రెండు పార్టీల మధ్య ఊగిసలాడుతున్న నేపథ్యంలో లగడపాటి సర్వేపై అందరి కళ్లూ పడ్డాయి. అయితే లగడపాటి మాత్రం ఈసారి సర్వే ఫలితాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ లగడపాటి తన రెగ్యులర్ సంస్థతో కలిసి సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం ఈసారి కర్నాటకలో గెలుపు బీజేపీదేనని స్పష్టం చేశారు. ఆ పార్టీకి 110-120 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. కాంగ్రెస్ కు 70-80, జేడీఎస్ కు 40వరకూ సీట్లు దక్కుతాయని తేల్చారు. కొంతకాలం వరకూ కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆ పార్టీ వెనుకబడిందని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని లగడపాటి సర్వే జోస్యం చెప్పింది. మరి లగడపాటి సర్వే ఏమాత్రం నిజమవుతుందో తెలియాలంటే ఎన్నికలవ్వాల్సిందే... అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే..