మహానాడు చివరిరోజు... 5 లక్షల మందితో భారీ సభ

కడప వేదికగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పండుగ  మహానాడు గురువారం ( మే 29) తో ముగియనుంది.  మంగళవారం (మే 27)న ప్రారంభమైన మహానాడు తొలి రెండు రోజులు అత్యంత విజయవంతంగా జరిగాయి. జగన్ పార్టీకి పెట్టని కోటగా చెప్పుకునే కడప వేదికగా జరిగిన ఈ మహానాడు పలు ప్రత్యేకతలక వేదికైంది.   మహానాడులో భాగంగా తొలి రెండు రోజులూ   ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ప్రతినిధుల సమావేశాలు నిర్విరామంగా జరిగాయి. ఈ సమావేశాలకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక చివరి రోజైన గురువారం (మే 29)న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు దాదాపు 5 లక్సల మంది హాజరౌతారన్నది అంచనా. ఈ సభలో పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర ముఖ్య నాయకుల ప్రసంగాలు ఉంటాయి.  

ఐదేళ్ల జగన్ అరాచక పాలన తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్నది. ఈ కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన, చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను వివరించడమే కాకుండా... పార్టీ, ప్రభుత్వ భవిష్యత్ లక్ష్యాలపై కూడా ఈ ప్రసంగాలు ఉంటాయి.  ఇక ఈ బహిరంగ సభ కోసం నిరవాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో దాదాపు 2 లక్షల మందికి భోజన సౌకర్యం కల్పించారు. అలాగే కడపకు దారి తీసే మార్గాలలో మరో మూడు లక్సల మందికి భోజన వసతి ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇలా ఉండగా కడపలో మహానాడు సందర్భంగా కడప జిల్లా మొత్తం పసుపుశోభ సంతరించుకుంది. ఎక్కడ చూసినా పసుపుపచ్చని జెండాలు, తోరణాలతో పంగుడ వాతావరణం నెలకొంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu