'బాద్ షా' పదవి పై జూనియర్ కసి

 

junior ntr tdp, nara lokesh junior ntr, junior ntr chandra babu, balakrishna junior ntr

 

 

గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ కి టిడిపి లో పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తరువాత తానే అధినేత అవుతానని భావిస్తున్న సమయంలో...నారా లోకేష్ సడన్ ఎంట్రీ తో జూనియర్ ఎన్టీఆర్ కి షాక్ తగిలింది.

 

నారా లోకేష్..టిడిపి అధ్యక్షుడి కుమారుడు, నందమూరి బాలకృష్ణ అల్లుడు కావడంతో పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ ను మనోవేదనకు గురి చేసింది. ఇంకా బాలకృష్ణ కూతురు తేజస్విని వివాహానికి కూడా జూనియర్ ఆహ్వానం పై లోకేష్ అభ్య౦తరం వ్యక్తం చేయడంతో ఆహ్వానించ లేదు. దీంతో స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వం కోసం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య పోటీ ప్రజ్వరిల్లినట్లేనని కూడా ప్రచారం జరుగుతోంది.    

   
      
కసితో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాత స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వం కోసం ఎన్ని కష్టనష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాని కోసం గత కాలంగా తండ్రి హరికృష్ణ కు కూడా దూరంగా ఉంటూ...ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే కేంద్రీకరించాడు. నందమూరి అభిమానుల్లో తన ఫాలోయింగ్ ఎక్కువగా పెంచుకోవడానికి కష్టపడుతున్నాడు. ఎలాగైనా వరుస సూపర్ హిట్లు కొట్టి ఎన్టీఆర్ వారసుడ్ని తానే అనిపించుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.


 
ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తన రాజకీయ వారసుడు నందమూరి బాలకృష్ణ అని ప్రకటించినా...తన సమర్ధతతో టిడిపి అధ్యక్ష పదవిని చేపట్టిన చంద్రబాబునే ఆదర్శంగా తీసుకొని... తాను తిరిగి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తాననె కసితో జూనియర్ ఉన్నాడని సన్నిహిత వర్గాలు అనుకుంటున్నారు.