జైలు నుంచి కొమ్మినేని విడుదల

 

అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యారు. గుంటూరు జైలు నుంచి విడుదలైన ఆయనకు వైసీపీ నేత అంబటి రాంబాబు స్వాగతం పలికారు. కాగా శుక్రవారమే సుప్రీం కోర్టు కొమ్మినేనికు బెయిల్ మంజూరైనా న్యాయస్ధానానికి వరస సెలవులు కారణంగా సంబంధిత ఉత్తర్వులను లాయర్లు పొందలేకపోయారు. ఇవాళ ఉత్తర్వులు అందడంతో ఆయన జైలుకు నుంచి విడుదలయ్యారు.

కాగా బెయిల్ మంజూరు సమయంలో కొమ్మినేనికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. మహిళలను కించపర్చేలా మరోసారి చేయొద్దని తెలిపింది. అలాగే ఆయనపై పోలీసులు పెట్టిన పలు సెక్షన్లపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే ఆ సెక్షన్లు తొలగించాలని, ఇక బెయిల్ కు సంబంధించి అన్ని విషయాలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని ధర్మాసనం తెలిపింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu