జయలలిత గెస్ట్ హౌస్ దగ్గర అస్తిపంజరం..స్థానికుల కలకలం...

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం... తమిళనాడు రాజకీయాలు ఎలా తయారయ్యాయే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకే పార్టీలో మూడు వర్గాలు ఏర్పడి అసలు ఎవరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారబ్బా అన్న ప్రశ్నలు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు రోజుకో ఆసక్తికర విషయం బయటపడుతూ ఉంటుంది. గత కొద్దిరోజుల క్రితం అమ్మ గెస్ట్ హౌస్ దగ్గర వాచ్ మెన్ దారుణ హత్యకు గురవ్వడంతో అదో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆలాంటి ఆసిక్తకర విషయమే మరొకటి చోటుచేసుకుంది. సిరుతాపూర్ బంగ్లా వద్ద గస్తీ కాస్తున్న పోలీసులకు అస్తిపంజరం కనిపించడంతో ఒక్క సారిగా కలకలం రేగింది. అయితే ఈ ఆస్తిపంజరం అక్కడ  సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యక్తిదిగా గుర్తించారు. ఆస్థి వ్యవహారంలో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కాగా చెన్నై నగరానికి సుమారు 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బంగ్లాకు జయలలిత అప్పుడప్పుడు విడిది కోసం మాత్రం వెళ్లేవారు. ప్రస్తుతం ఈ బంగ్లా శశికళ, దినకరన్ కుటుంబీకుల ఆధీనంలో ఉంది. వాళ్ల కుటుంబ సభ్యులే ఆ బంగ్లాలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గెస్ట్ హౌస్ దగ్గర ఆస్తిపంజరం కనిపించడంతో పెద్ద దుమారం రేగుతుంది. మరి దీనిపై ఇంకెంత దుమారం చెలరేగుతుందో చూడాలి.