జయలలిత మాజీ డ్రైవర్ మృతి...
posted on Apr 29, 2017 1:14PM
.jpg)
ఇప్పటికే తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కొడనాడ్ ఎస్టేట్ వాచ్ మెన్ దారుణ హత్యకు గురవ్వగా.. ఇప్పుడు మాజీ డ్రైవర్ కనకరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పలు అనుమానలు వ్యక్తమవుతున్నాయి. సాలెం జిల్లాలోని అత్తూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జయలలిత డ్రైవర్ కనకరాజు ప్రాణాలు కోల్పోయాడు. అయితే కనకరాజుది ముమ్మాటికే హత్యేనని జయలలిత మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. కాగా కొడనాడు ఎస్టేట్ వాచ్ మెన్ హత్యలో కనకరాజు హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో, కేసు కీలక మలుపు తిరిగినట్టైంది. కాగా జయలలిత పేరును కనకరాజు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో బతికున్న ఈయనను 2012లో జయ ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలో, త్రిశూర్ కు చెందిన సయన్ అనే వ్యక్తితో చేతులు కలిపి, కొడనాడ్ ఎస్టేట్ ను దోచుకునేందుకు కనకరాజు పథకం పన్నినట్టు పోలీసులు భావిస్తున్నారు.