బీఫ్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే.. రంగు పడింది
posted on Oct 20, 2015 12:41PM

ఇప్పటికే గోమాంసంపై పలురకాల వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు బీఫ్ పార్టీ ఇచ్చినందుకు ఓ ఎమ్మెల్యేపై అసెంబ్లీలోనే దాడి చేశారు. ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యేపై రంగుపడింది. వివరాలప్రకారం.. జమ్మూకాశ్మీర్ శాసనసభ స్వతంత్ర ఎమ్మెల్యే ఇంజనీర్ రషీద్ ఆవు మాంసంతో తన అనుచరులకు విందు పార్టీ ఇచ్చారు. దీంతో ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ వద్ద హిందూసేన అనే సంస్థకు చెందిన కార్యకర్తలు హిందువులను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నాడంటూ ఆయనపై ఇంకు చల్లి దాడి చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనంతరం రషీద్ మీడియాతో మాట్లాడుతూ ముంబైలో సుధీంద్ర కులకర్ణికి ఏం జరిగిందో నాకూ అదే జరిగింది. ఈరోజు భారత్ పరిస్థితి ఏమిటో ప్రపంచంచూడాల్నారు. పాకిస్థాన్‌లో తాలిబాన్ రాజ్యం వస్తున్నదని అంటున్నారు.. కానీ ఇండియాలో జరుగుతున్నదేమిటి అని రషీద్ ప్రశ్నించారు. గాంధీ పుట్టిన దేశం అని మనం అనుకుంటున్నాం కానీ ప్రస్తుతం ఇది గాంధీ పుట్టిన దేశం కాదని.. మోడీ పుట్టిన దేశంలా మారిందని విమర్శించారు.