రెచ్చిపోయిన పాక్... ఇద్దరు భార‌త జ‌వాన్లు మృతి..

 

జమ్మూకాశ్మీర్ లో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘిస్తూ కాల్పులు జరిపింది. వివరాల ప్రకారం.. జ‌మ్మూక‌శ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద బీఎస్ఎఫ్‌కు చెందిన పార్వ‌ర్డ్ డిఫెన్స్ లొకేష‌న్ వ‌ద్ద పాకిస్థాన్ ట్రూప‌ర్లు రాకెట్ల‌తో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్ద‌రు భార‌త జ‌వాన్లు చ‌నిపోయారు. ఇందులో ఓ బీఎస్ఎఫ్ జ‌వానుతో పాటు జూనియ‌ర్ క‌మీష‌న్డ్ ఆఫీస‌ర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈరోజు ఉదయం కూడా పూంచ్ జిల్లాలోని కృష్ణ‌ఘాటి సెక్టార్‌లో ఉన్న బీఎస్ఎఫ్ పోస్ట్‌ల‌పై పాక్ ఆర్మీ భారీ ఫైరింగ్ జ‌రిపింది. రాకెట్లు, ఆటోమెటిక్ వెప‌న్స్‌తో పాక్ దాడి చేసినా, బీఎస్ఎఫ్ జ‌వాన్లు ధీటుగా ఎదుర్కొన్నార‌ని భార‌త ఆర్మీ పేర్కొన్న‌ది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu