జమ్ముకాశ్మీర్లో కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం


నిరంతరం కాల్పుల మోతలతో దద్దరిల్లే జమ్ముకాశ్మీర్లో ఈరోజు కూడా భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుపెట్టింది. జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పంజ్‌గమ్‌ గ్రామంలో భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. చనిపోయిన ఉగ్రవాదులను హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా గుర్తించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu