పోలీస్ స్టేషన్ కు నిప్పంటించిన జల్లికట్టు నిరసనకారులు..

 

జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ చెన్మై మెరీనా బీచ్ వద్ద విద్యార్ది సంఘాలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో మెరీనా బీచ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అంతేకాదు కొంతమంది ఆందోళనకారులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. మెరీనా బీచ్‌లో ఉన్న ఐస్ హౌజ్ పోలీస్ స్టేష‌న్‌కు నిర‌స‌న‌కారులు నిప్పుపెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. పెట్రోల్ బాంబాలతో దాడి చేశారు.

 

ఇదిలా ఉండగ ఇవాళ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మైన నేపథ్యంలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని ప్ర‌తిప‌క్షాలు అడ్డుకున్నాయి. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని వ్య‌తిరేకిస్తూ డీఎంకే పార్టీ వాకౌట్ చేసింది. శాంతియుతంగా నిర‌స‌న చేప‌డుతున్న ఆందోళ‌న‌కారుల‌పై అన్యాయంగా ప్ర‌భుత్వం లాఠీచార్జ్ చేసింద‌ని క‌నిమొళి ఆరోపించారు. జ‌ల్లిక‌ట్టుపై శాశ్వ‌త ప‌రిష్కారం కావాల‌ని ఆమె డిమాండ్ చేశారు.