సమాజ్ వాదీ పార్టీకి గట్టి షాక్.. బీజేపీలోకి నరేశ్ అగర్వాల్...
posted on Jan 23, 2017 11:32AM

ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. పార్టీ ఫిరాయింపులు కూడా ఎక్కువవుతున్నాయి. వీటితో పాటు పలు పుకార్లు కూడా బాగానే చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్పీ వ్యవస్థాప సభ్యుల్లో ఒకరు, ప్రస్తుత ఎంపీ నరేశ్ అగర్వాల్ పై కూడా పార్టీ మారుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, ఎస్పీ పార్టీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. అయితే ఈ పొత్తును నిరసిస్తూ అగర్వాల్ నేడో, రేపో పార్టీని వీడి బీజేపీలోకి చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
మరోవైపు ఈ వార్తలపై నరేశ్ అగర్వాల్ స్పందించి వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నారు. "నేను బీజేపీలో చేరతాననే వార్తలు పూర్తిగా అబద్ధం. నాకా ఆలోచనలేనేలేదు. సమాజ్‌వాదీ పార్టీలోనే నా జీవితం కొనసాగుతుంది. అఖిలేశ్ నాయకత్వంలోనే పనిచేస్తా. బీజేపీని చిత్తుగా ఓడించడమే మా లక్ష్యం" అని నరేశ్ అగర్వాల్ స్పష్టం చేశారు.