కేసీఆర్ ని ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు
posted on Oct 18, 2015 9:19PM
.jpg)
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం బేగంపేటలో ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి అమరావతి ఆహ్వాన పత్రం అందజేసి కుటుంబ సమేతంగా అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించారు.చంద్రబాబు నాయుడుతో బాటు తెలంగాణా తెదేపా అధ్యక్షుడు యల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్న తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కె. తారక రామారావు, జగదీశ్ రెడ్డికి కూడా ఆహ్వానపత్రాలు అందజేసి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రావలసిందిగా వారిని కూడా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తను తప్పకుండా వస్తానని కేసీఆర్ చెప్పారు. అనంతరం చంద్రబాబు నాయుడుని కేసీఆర్ కి అమరావతి అభివృద్ధి ప్రణాళిక ఇతర విశేషాల గురించి వివరించారు. వారిరువురూ సుమారు గంటసేపు అనేక విషయాల గురించి మాట్లాడుకొన్నారు. మళ్ళీ 8 నెలల తరువాత వారిరువురూ ఈవిధంగా కలిసి కూర్చొని చాలాసేపు మాట్లాడుకోవడం చూసి అందరూ చాలా సంతోషిస్తున్నారు.