ఆ పేరు అంటేనే వైసీపీ వణుకుతుంది...
posted on Nov 5, 2017 1:55PM
.jpg)
వైసీపీకి ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకుంది. అదేంటంటే విశాఖ ఎన్నికలు. ఇప్పటికే నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. అందుకే వైసీపీకి ఇప్పుడు టెన్షన్ పడుతుంది. దీంతో ఇప్పటినుండే ఎన్నికలకు నేతలను సిద్దం చేసే పనిలో పడింది. అసలే రెండు ఎన్నికల్లో గెలిచి టీడీపీ ఫుల్ జోష్ లో ఉంది. మరోవైపు విశాఖలో వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వైసీపీకి ఉన్న బలమైన నేతలంతా ఒక్కొక్కరుగా జారుకోవడంతో.. ఆ పార్టీకి చెప్పుకోదగిన బలమైన నేత ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అందుకే విశాఖ జిల్లా పేరు చెబితే చాలు వైసీపీ వెన్నులో వణుకు వచ్చేస్తోందట. ఇప్పటికే సంస్థాగతంగా బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకున్న వైసీపీ…వైఎస్‌ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని పూర్తిగా బూత్ కమిటీలకు అప్పగించింది. ఇదిలా ఉండగా...జగన్ పాదయాత్ర మొదలవుతుంది. జగన్ చేపట్టబోయే పాదయాత్ర కూడా తమకు కలసి వస్తుందేమో అని వైసీపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మొత్తానికి వైసీపీ నేతలే ఈ ఎన్నికలకే ఇంత భయపడుతుంటే.. సార్వత్రిక ఎన్నికలకు ఇంకెంత భయపడతారో...