హైకోర్టులో జగన్ కు చుక్కెదురు...

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. అధికారులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో ఆయనుక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  వివరాల ప్రకారం..కృష్ణా జిల్లా నందిగామలో అధికారులపై జగన్ దురుసుగా ప్రవిర్తించిన తీరుపై జగన్‌పై కేసు నమోదైంది. ఇక ఈ కేసును కొట్టివేయాల్సిందిగా జగన్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం కేసు కొట్టివేతకు నిరాకరిస్తూ క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.